Tuesday, 10 April 2018

గూడు లేని గువ్వలా దారి తప్పితి


నీ గుండెలో దాచుమా 
నీ గూటికే చేర్చుమా 
నాప్రాణమా 
నా క్షేమము నీవయ్యా
గూడు లేని గువ్వలా దారి తప్పితి 
గుండె చెదిరిన కోయిలనై మూగబోయితి “2”
                                   "నా ప్రాణమా"
గువ్వలకు గుళ్ళిష్ట౦ కోయిలకు పాటిష్టం 
నా కేమొ నువ్విష్టం నీ సన్నిధి ఎంతో ఇష్టం “2”
నువ్వంటే ఇష్టం యేసయ్యా 
నువులేకుంటే బ్రతుకే కష్టమయా “2”  
                                    “నా ప్రాణమా”
చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం 
నాకేమో చెలిమిష్టం నీ సన్నిధి ఎంతో ఇష్టం “2”
నేనంటే నీకెంతో ఇష్టమయా 
నీవెంటుంటే ఇంకా ఇష్టమయా “2”   
                                    “నా ప్రాణమా”


             దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment