Thursday, 5 April 2018

నాదారి గోదారిలో..... బ్రతుకే హైలెస్సో


నాదారి గోదారిలో..... బ్రతుకే హైలెస్సో
...... పలికే నీ..దాసు..... యేసో...........
ఎంత వరలమనుసో...నీది 
చిత్రా చిత్రాలుగ విన్నానయ్య ఊసు......
ప్రభువా హైలెస్సో పలికే నీ దాసు “2” 
                               "యేసో"
గాలి వానొచ్చె నడియేటిలోన నావ అల్లాడగా........
మహిమ చూపించినావే 
కంట చూడంగ గాలాగిపోయె
అలలే చల్లారేనే.... నీవే కాపాడినావే.....
నిన్ను పొగడంగ నె౦తటివాడన్ 
నీటి మడుగుల్లో చేపంటి వాడన్ “2”
నాదారి గోదారిలో...... ప్రభువా హైలెస్సో...... 
పలికే నీ దాసు......     
                                “యేసో”
దిక్కులేనట్టి దీనాత్ములంటే 
నీలో కలిగేదయా... నేడేతెలిసి౦దయా “2”
జంతు బలులిచ్చే మూడాత్ములంటే 
నీలో రగిలేసొదా.... కరుణే వెదజల్లెగా
నీవే రేవంట ఏనావకైనా నీవే 
కడలంట ఏ దాగుకైనా “2”
ఉప్పొ౦గే నీ ప్రేమలో...... బ్రతుకే హైలెస్సో 
పలికే నీ దాసు                
                                “యేసో”

      దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment