Tuesday, 3 April 2018

వందనాలయ్యా ఆదాం బెన్ని గారి పాట

వందనాలయ్యా- వందనాలయ్యా
వందనాలయ్యా- నీకే వందనాలయ్యా
యేసు రాజా నా యేసు రాజా }
నీకేవందనాలయ్యా వందనాలయ్యా } "2"
*వందనాలే.....వందనాలే*
*వందనాలయ్యా- వందనాలయ్యా* "2"
ఇంత వరకు కాచినావు నీకు వందనాలయ్యా
ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా
అమ్మ వలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా
నాన్న వలే నన్ను లాలించినందుకు వందనాలయ్యా
                                          *"వందనాలే"*
కట్టుకొనుటకు వస్త్ర ములిచ్చావు వందనాలయ్యా
భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా
ఉండుటకు నివాసము ఇచ్చావు వందనాలయ్యా
అన్ని వేళలో ఆదుకున్నందుకు వందనాలయ్యా
                                         *"వందనాలే"*
వ్యాధి బాధలలో నెమ్మది నిచ్చావు వందనాలయ్యా
హస్తము చూపి స్వస్థపర్చినావు వందనాలయ్యా
పరమవైద్యుడా యేసయ్య వందనాలయ్యా
మా ఆప్త మిత్రుడా యేసయ్య వందనాలయ్యా
                                          *"వందనాలే"*
ఏడ్చినపుడు ఓదార్చి నావు వందనాలయ్యా
కన్నీళ్ళు తుడిచి కౌగలించినావు వందనాలయ్యా
చెయ్యి పట్టి నడుపుచున్నందుకు వందనాలయ్యా
పరమ తండ్రి నా యేసయ్య వందనాలయ్యా
                                       *"వందనాలే"*
        దేవునికి మహిమ కలుగును గాక!
   *-------------------------------------------*
  సేకరణ:
          🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
              సెల్ నెంబర్:9948089237
           lvpaul9460.blogspot.com
            🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment