Monday, 2 April 2018
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతె
నా బ్రతుకు యాత్రలో
నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను
పరదైసు చేరిపోతే
*ఆనందము సంతోషము*
*పరిశుద్ధులందరితో సహవాసము " 2 "*
ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే "2"
జనన మరణాల బ్రతుకు
విలువైనది సోదరా " 2 "
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే
యుగయుగాలు బాధరా " 2 " *" ఆనందము "*
వలస వచ్చిన పక్షులు
మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని
మరువకనే జీవిస్తాయి " 2 "
పక్షి కంటే శ్రేస్థుడు మనిషి
పరలోకం మరిచాడు " 2 "
తండ్రియైన దేవుడు చేరే
దారి మరిచిపోయాడు " 2 " *"ఆనందము "*
తీర్చలేని దేవుని ఋణము
ఏమిచ్చిన మనము
అర్పించు నీదేవునికి
నీయొక్క జిహ్వఫలము " 2 "
నింగి నేల గతించినా
గతించవు యేసు మాటలు " 2 "
వెండి బంగారములైన
సాటిరాని సంపదలు " 2 " *" ఆనందము "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment