Monday, 2 April 2018
తల్లి తండ్రుల కుంటదా యేసయ్య నీలాంటి ప్రేమ
*తల్లిదండ్రుల కుంటదా........?*
*యేసయ్య నీలాంటి ప్రేమ*
*బంధు మిత్రుల కుంటదా......? " 2 "*
*యేసయ్య నీలాంటి ప్రేమ*
*స్నేహితుల కుంటదా ?*
*ప్రాణ స్నేహితుల కుంటదా ? " 2 "*
*యేసయ్య నీలాంటి ప్రేమ " 2 "*
*"తల్లిదండ్రుల"*
నన్ను కన్నవారి ప్రేమ కొంతకాలమేగా
నన్ను విడిచి దూరపరచి వెళతారుగా
నాపై చూపే వారి ప్రేమ
ఎల్లకాలం చూపరుగా
ఏదోరోజున నను గాయపరచి పోతారుగా "2"
యేసయ్య నీప్రేమ నను విడచిపోలేదయ్య
యేసయ్య నీప్రేమ నన్ను మరచిపోలేదయ్య"2"
*" తల్లిదండ్రుల "*
నేను నమ్ము వారి ప్రేమ
కలకాలం నాతో ఉండదుగా
ద్రోహం చేసి నన్ను వదిలిపోతారుగా
నాకై వేచే వారి ప్రేమ అవసరానికేగా
తీరగానే నన్ను మరచి మాయమౌతారుగా"2"
యేసయ్య నీప్రేమ నన్ను వదిలిపోలేదయ్య
యేసయ్య నీప్రేమ నన్ను దాటిపోలేదయ్య" 2 "
*" తల్లిదండ్రుల "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment