Monday, 2 April 2018
భరియించలేనయ్యా నీ మౌనము
*భరియించలేనయ్యా నీ మౌనము* }
*సహించలేనయ్యా ఈ భారము* } "2"
*ఊహించలేదయ్యా ఈ దూరము* "2"
*మన్నించు యేసయ్యా నా పాపము* "2"
*"భరియించలేనయ్యా"*
నీ ప్రేమకాదనే నే వెళ్ళితి }
నీతోడు లేకయే నేనలసితి } "2"
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మక ద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము
*"భరియించలేనయ్య"*
నిరాశ నిస్పృహలో నలిగిపోతిని }
నీమాట కాదని దూరమైతిని } "2"
నా బ్రతుకు బారమాయే బలపరచు యేసయ్యా
నా తనువు చిత్రమాయే కదలించు యేసయ్యా
విడువని బంధమేగా ఆ కలువరి యాగము
నను వీడి పోద దేవా ఈ మౌన వేధనా
*"భరియించలేనయ్య"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment