Monday, 2 April 2018
బ్రతిమాలుచున్నది నా యేసు ప్రేమ
*బ్రతిమాలుచున్నది నాయేసు ప్రేమ*
*దినదినము నిన్ను బ్రతిమాలుచున్నది " 2 "*
*వీధి వీధి తిరిగి నీ ఇంటికొచ్చి*
*పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది " 2 "*
*పదే పదే నిన్ను బ్రతిమాలుచున్నది
*" బ్రతిమాలుచున్నది "*
లోక స్నేహం దేవునితో వైరము
ఆ స్నేహము నీవు విడువాలని " 2 "
పరము నుండి దేవుడు ధరణికి వచ్చి
తనతో స్నేహం చేయమనుచు " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
*" బ్రతిమాలుచున్నది "*
పాపిగానే నీవు ఉన్నప్పుడు
క్రీస్తు యేసు నీకొరకే మరణించెను " 2 "
శిక్ష నుండి నిన్ను తప్పించాలని
పరలోక పౌరత్వం ఇవ్వాలని " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
చేతులు చాచి పిలుచుచున్నాడు " 2 "
*" బ్రతిమాలుచున్నది "*
ఏ యోగ్యత లేని నిన్ను పిలచి
దివ్యమైన తన సేవను అప్పగించెను " 2 "
లోకభోగాలకు బానిస కాక
లోకమంతా సువార్తను ప్రకటించాలని " 2 "
పదే పదే నిన్ను బ్రతిమాలుచు
కన్నీళ్లతో నిన్ను అడుగుచున్నాడు " 2 "
*" బ్రతిమాలుచున్నది "*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment