Tuesday, 3 April 2018

సుందరవతి సంఘమా

సుందరవతి సంఘమా ప్రియుడేసు నిన్
పరిణయమాడగ రానుండే(2)
విడుదల కలుగును వేచియుండుము (2)
నీ ప్రియ వరుడు అరుదెంచునుగా
                            "సుందరవతి"
తొలగించుము నీ రాపిడి వలువలు 2
ధరియించుము నీ దివ్యాంభరములు 2
మురియును నీ ప్రభు నిన్ను చూడను
కురిపించును తన కృప దీవెనలు 2
                             "సుందరవతి"
విందువు బూరల మంగళ ధ్వనులు 2
కందువు యేసుని సుందర రూపం 2
విందులో నీవు పాలొందెదవు డెందము
సంతస మొగమగు నిజము2
                              "సుందరవతి
అరుదెంచునుగా మేఘ రధములు 2
పరమండలపు పయనము సేయ 2
వరుడగు క్రీస్తుని సరసన చేరి
పరవశమొంది ప్రణమిల్లెదవు2
                               "సుందరవతి||
         దేవునికి మహిమ కలుగును గాక! *-------------------------------------------*
   సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
           సెల్ నెంబర్:9948089237  
        lvpaul9460.blogspot.com
         🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment