కల్యాణం కమనీయం }
ఈ సమయం అతిమధురం }
“2”
దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా “2”
“కల్యాణం”
ఏదేనువనమున యెహోవ దేవా }
మొదటి వివాహము చేసితివే }
“2”
ఈ శుభదినమున నవ దంపతులను “2”
నీ దీవెనలతో నింపుమయా “2”
“కల్యాణం”
కానా విందులో అక్కరలెరిగి }
నీళ్ళను రసముగ మార్చితివే }
“2”
కష్టములలో నీవే అండగనుండి “2”
కొరతలు తీర్చి నడుపుమయా “2”
“కల్యాణం”
బుధ్ధియు జ్ఞానము సంపదలన్నియూ }
గుప్తమైయున్నవి నీయందే } “2”
ఇహపర సుఖములు మెండుగనొసగి “2”
ఇల వర్ధిల్లగజేయుమయా “2”
దేవునికి మహిమ కలుగును గాక
*-------------------------------------------*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
No comments:
Post a Comment