Thursday, 5 April 2018

నలుగకుండ గోధుమలు కడుపునింప గలుగునా


నలుగకుండగోధుమలు 
కడుపు నింప గలుగునా 
కరగకుండ కొవ్వత్తి 
కాంతినివ్వగలుగున 
అంతిమ యాత్రలో 
నలుగుటయే విలువయా "2"
ఇరుకైన బాటలో 
కరుగుటయే వెలుగయా “2” 
                     “నలుగ”
పగలని బండ ను౦డి 
జలములు ఊరునా విరుగని 
పొలము మనకు పంట ఇవ్వగలుగునా
పరలోక యాత్రలో 
పగులుటయే వరమయా “2”
విశ్వాసి బాటలో 
విరుగుటయే వరమయా “2” 
                     “నలుగ”
రక్తము కార్చకుడ 
పాపములు పోవునా
కన్నీరు కార్చకుండా 
కలుషతములు తరుగునా
అంతిమ యాత్రలో 
క్రీస్తేసే గమ్యమయా “2”
బహుదూర బాటలో 
ప్రభు యేసే శరణమయా “2” 
                   “నలుగ”

     దేవునికి మహిమ కలుగును గాక!
 *-------------------------------------------*
  సేకరణ:
       🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
            సెల్ నెంబర్:9948089237
          lvpaul9460.blogspot.com
           🙏*Praise The Lord*🙏

No comments:

Post a Comment