Tuesday, 3 April 2018
పరదేశి...ఓ....పరదేశి రాజబాబు గారి పాట
పరదేశీ.....ఓ పరదేశీ....
ఎటుచూసినా ఎడారులే
ఎండిపోయినా ఎండమావులే
*ఏనాటికైనా ఈ కాయము*
*మాయమగుటే ఖాయము*
*ఈ నాటికైనా యేసయ్యను*
*చేరుకోనుటే న్యాయము*
*యేసు రక్తమే జయము* }
*సిలువ రక్తమే జయము* } "4"
కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా }
కన్నబిడ్డల కన్నీరు ఏరులై పారినా } "2"
అన్నదమ్ములే నీకై కలవరించినా
అలమటించినా.....
బంధువులంతా బ్రతిమాలినా
ఆత్మీయులే అడ్డగించినా...
*"ఏనాటి"*
ఫ్యాక్టరీలు ఉన్న మోటరు కారులెన్ని ఉన్నా }
పొలాలెన్ని ఉన్నా ఇళ్లస్థలాలెన్ని కొన్నా } "2"
అందగాడివైనా ఆటగాడివైనా
అందని మాటకారివైనా
సిపాయివైనా కసాయివైనా
బికారివైనా ఏకాకివైనా
*"ఏనాటి"*
తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా }
నాయకత్వమున్న ఎంతటి ప్రేమతత్వమున్న }"2"
విద్యావేత్తవైనా...తత్వవేత్తవైనా...
ఎంతటి శాస్త్రవేత్తవైనా...
థీయిస్టువైనా ఎథిస్టువైనా
మార్కిస్టువైనా కోపిష్టివైనా
*"ఏనాటి"*
దేవునికి మహిమ కలుగును గాక!
*-------------------------------------------*
రచన:స్వరకల్పన:గానం
*"బ్రదర్.రాజబాబు గారు"*
సేకరణ:
🎹🎼యల్.వి.పాల్:ఖమ్మం🎼🎹
సెల్ నెంబర్:9948089237
lvpaul9460.blogspot.com
🙏*Praise The Lord*🙏
Subscribe to:
Post Comments (Atom)
Wonderful song
ReplyDeleteThank you for collecting this
ReplyDelete